
మొదటి షో వివరాలు : అర్జున్ S/O వైజయంతి
క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ తో ఈ చిత్రం సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
ఇప్పుడు అర్జున్ తన తల్లిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగాడు. వీటికి సంబంధించిన సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
ఇప్పుడు ఒక షాకింగ్ ట్విస్ట్ తో కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ వస్తున్నాయి.
కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు తర్వాత ఇపుడు కథనం పఠాన్ వైపుకి వచ్చింది. అతను జైలు నుంచి తప్పించుకుంటున్నాడు
ఆ కాలనీ ప్రజలు అర్జున్ గొప్పదనం కోసం వైజయంతి వివరిస్తున్నారు. ఇప్పుడు మరో యాక్షన్ సీన్ మొదలైంది.
ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు అర్జున్ సామ్రాజ్యంలోకి వైజయంతి ఎంటర్ అయ్యారు. ఆ ప్రాంతానికి సంబంధించిన సన్నివేశాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా డీసెంట్ గా సాగింది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. విజయశాంతి తన రోల్ లో బాగున్నారు. కళ్యాణ్ రామ్ కూడా డీసెంట్ గా కనిపించాడు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇప్పుడు అర్జున్ ఒక అటాక్ నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో తనపై అటాక్ చేసింది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఓ షాకింగ్ నిజం తాను తెలుసుకున్నాడు. ఇలా ఒక ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇపుడు విరామం.
అర్జున్ లో మార్పుకి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. ఇప్పుడు కథనంలో ఫోకస్ విలన్ వైపుకి మారింది.
ఇప్పుడు కమిషనర్ వైజయంతిని ప్రశ్నిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు కథనం 2021 కి షిఫ్ట్ అయ్యి ముచ్చటగా బంధాలే సాంగ్ మొదలైంది.
మొదటి సాంగ్ నాయాల్ది తర్వాత కమీషనర్ గా నటుడు శ్రీకాంత్ పరిచయం అయ్యారు. ఇప్పుడు కథనం తనకి, అర్జున్ నడుమ సన్నివేశాలకి చేరుకుంది.
ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తో తన మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అర్జున్, వైజయంతి పై ఓ కోర్ట్ సీన్ మొదలైంది.
ఐపీఎస్ గా నటి విజయశాంతి ఇప్పుడు పరిచయం అయ్యారు. తన ప్రొఫిషినల్ లైఫ్ కోసం సీన్స్, ఇంకో పక్క విలన్ పఠాన్ పై కూడా సన్నివేశాలు వస్తున్నాయి.
హాయ్.. 2 గంటల 24 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.