-
-
మొత్తానికి "ధీమాగా" అనే పాటతో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:12 AM December 21, 2018
-
సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.వరుణ్ టీమ్ మళ్ళీ భూమి మీదకు వచ్చేందుకు తిరుగు ప్రయాణం చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:00 AM December 21, 2018
-
శాటిలైట్ లలో కోల్పోయిన సమాచారాన్ని సేకరించడానికి వరుణ్ చంద్రుని మీదకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:50 AM December 21, 2018
-
వారు చేపట్టిన మిషన్ లో కొన్ని అనుకోని సమస్యలు వస్తున్నాయి.
Date & Time : 07:45 AM December 21, 2018
-
ఇప్పుడు మిషన్ "కిన్నెర" కు రంగం సిద్ధమయ్యింది.ఈ మిషన్ చంద్రుని మీద మొదలవుతుంది.
Date & Time : 07:35 AM December 21, 2018
-
ఇప్పుడే ఊహించని విధంగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది.వరుణ్ మరియు రెహమాన్ ల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి.శంకర్ కు మరియు అతని కూతురికి మధ్య కొన్ని భావోద్వేగ పూరిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:30 AM December 21, 2018
-
ఇప్పుడు వరుణ్ మరియు అదితి స్పేస్ వాక్ చేస్తూ మిషన్ ను విజయవంతం చేసారు.ఇప్పుడు వరుణ్ తన సొంత మిషన్ ను తయారు చేస్తున్నారు,దానికి గాను శ్రీనివాస్ అవసరాల మంచి సపోర్ట్ ఇస్తున్నారు.
Date & Time : 07:18 AM December 21, 2018
-
విరామం ముగిసింది,అదితి రావ్ అంతరిక్షం లో స్పేస్ వాక్ చేస్తున్న సన్నివేశంతో మొదలయ్యింది. వారు చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయ్యింది,టీజర్లో డైలాగ్ "ఇండియా ఈస్ నాట్ గాన లాస్" ఇప్పుడు వస్తుంది.
Date & Time : 07:05 AM December 21, 2018
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా అంతా సజావుగా పర్వాలేదనిపించే స్థాయిలో సాగింది.ఇంటర్వెల్ సన్నివేశం కూడా బాగానే ఇచ్చారు.దీన్ని బట్టి సెకండాఫ్ కొంచెం ప్రధాన పాత్ర పోషించేందుకు అవకాశం ఉంది అని చెప్పొచ్చు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో,ఏం జరగబోతుందో వేచి చూద్దాం.
Date & Time : 06:52 AM December 21, 2018
-
ఇప్పుడు హీరో వరుణ్ తేజ్(దేవ్), హీరోయిన్ అదితి(రియా) మరియు సత్యదేవ్,శంకర్(సిరివెన్నెల సీతారామ శాస్త్రి)లు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమయ్యారు.ఇప్పుడు విరామం.
Date & Time : 06:45 AM December 21, 2018
-
వరుణ్ తేజ్ మిహరా శాటిలైట్ ను ఫిక్స్ చేసేందుకు అంతరిక్షం లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 06:35 AM December 21, 2018
-
ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.ఇప్పుడు మరో పాట "పలుకవే" వస్తుంది.
Date & Time : 06:24 AM December 21, 2018
-
ఇప్పుడు కొన్ని గతానికి మరియు ప్రస్తుతానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.ఫ్లాష్ బ్యాక్ లోకి చిత్రం ఇప్పుడు వెళ్ళింది.వరుణ్ లాంచ్ చేసిన శాటిలైట్ విప్రయాన్ ఇప్పుడు వెళ్తుంది.
Date & Time : 06:18 AM December 21, 2018
-
ఇప్పుడే రెహామన్ యొక్క కుమార్తెగా మరియు వరుణ్ తేజ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ గా లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు మొదటి పాట "సమయమా"కు వేళయింది.
Date & Time : 06:03 AM December 21, 2018
-
హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ ఇప్పుడు పరిచయం కాబడ్డారు.వరుణ్ ఒక శాస్త్రవేత్తగా మరియు అదితి ఒక వ్యోమగామిగా కనిపిస్తున్నారు.ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చూపిస్తున్నారు.ఇప్పుడు మళ్ళీ అంతరిక్షం లోకి సీన్స్ వచ్చాయి.
Date & Time : 05:55 AM December 21, 2018
-
5 ఏళ్ల తర్వాత..భూమి మీద శ్రీనివాస్ అవసరాల మిహరా శాటిలైట్ లో లోపాలను పరిష్కరించే వ్యక్తిగా కనిపిస్తాడు.ప్రముఖ నటుడు రెహమాన్ అతని యొక్క బాస్ గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:48 AM December 21, 2018
-
సినిమా ప్రారంభం అంతరిక్షంలో చంద్రుడు మరియు శాటిలైట్ లను చూపిస్తూనే ఆసక్తికరంగా మొదలయ్యింది.ఈ విజువల్స్ చూడడానికి చాలా గ్రాండ్ గా, అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 05:44 AM December 21, 2018
-
హాయ్ 130 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది...
Date & Time : 05:40 AM December 21, 2018