'ఆంధ్ర కింగ్ తాలూకా'
'Andhra King Taluka ' Live updates in English Version
మొదటి షో వివరాలు : 'ఆంధ్ర కింగ్ తాలూకా'
ఇప్పుడు రావు రమేష్ పై ఓ ఎమోషనల్ సీన్ సీక్వెన్స్ తో చాలు ఇది చాలు సాంగ్ వస్తుంది.
ప్రస్తుతం కథనం డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే మెలోడీ సాంగ్ చిన్ని గుండెలో ఇప్పుడు మొదలైంది.
ఇంటర్వెల్ అనంతరం.. ఫైనల్ గా రామ్ తన ఆరాధ్య హీరోని కలవడానికి వెళుతున్నాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా ఓకే రేంజ్ లో సాగింది. తన రోల్ లో రామ్ పోతినేని బాగున్నాడు. భాగ్యశ్రీపై కూడా కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇప్పుడు రామ్, మురళీ శర్మ నడుమ ఓ కీలక సన్నివేశంతో సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
ఇప్పుడు కథనం ప్రస్తుతానికి మారింది. ఇక నువ్వుంటే చాలే సాంగ్ మొదలైంది.
ఉపేంద్రకి రామ్ ఎంత పెద్ద అభిమాని అనేది తన చిన్ననాటి సన్నివేశాలతో ఇప్పుడు చూపిస్తున్నారు.
ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇచ్చింది. అలాగే రామ్, ఇతర ఫ్యాన్స్ తో సన్నివేశాలు వస్తున్నాయి.
ఉపేంద్ర వీరాభిమానిగా రామ్ పోతినేని ఒక మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సినిమా టైటిల్ సాంగ్ మొదలైంది.
ఇప్పుడు ఉపేంద్ర కెరీర్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు రామ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది.
ఒక సినిమా స్టార్ గా ఉపేంద్ర ఇప్పుడు పరిచయం అయ్యారు. ఇప్పుడు 2002 హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.
హాయ్.. 166 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.