-
ఓ ఊహించని అంశంతో సినిమా ఫైనల్ గా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 09:40 AM Feb 10, 2023
-
ఈ డోప్లాంగర్స్ పై ఓ కీలక సన్నివేశం ఇప్పుడు వస్తుండగా ముగ్గురు రోల్స్ లో కళ్యాణ్ రామ్ మంచి వేరియేషన్స్ కనబరుస్తున్నాడు.
Date & Time : 09:30 AM Feb 10, 2023
-
ఇప్పుడు ఎన్ ఐ ఏ మరియు విలన్ లపై ఓ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 09:20 AM Feb 10, 2023
-
కీలక పాత్రధారుల మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 09:10 AM Feb 10, 2023
-
కళ్యాణ్ రామ్ మరియు తన ఫ్యామిలీ మధ్య పలు సన్నివేశాలు వస్తున్నాయి. జయప్రకాష్ కళ్యాణ్ రామ్ తండ్రిగా కనిపిస్తున్నారు.
Date & Time : 09:00 AM Feb 10, 2023
-
ఇప్పుడు సినిమాలో అవైటెడ్ రీమిక్స్ సాంగ్ ఎన్నో రాత్రులు వస్తాయి స్టార్ట్ అయ్యింది. విజువల్స్ మరియు కళ్యాణ్ రామ్ ఆషికా ల మధ్య కెమిస్ట్రీ బాగుంది.
Date & Time : 08:55 AM Feb 10, 2023
-
ఓ కీలక డీటెయిల్ కోసం కళ్యాణ్ రామ్ తెలుసుకుంటున్న ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:50 AM Feb 10, 2023
-
ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరియు బ్రహ్మాజీ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:40 AM Feb 10, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..డోప్లాంగర్స్ బ్యాక్ స్టోరీ అయితే ఇప్పుడు కనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ స్టన్నింగ్ గా ఉన్నాడు.
Date & Time : 08:30 AM Feb 10, 2023
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా ఓకే అని చెప్పొచ్చు. డోప్లాంగర్ కాన్సెప్ట్ ని బాగా చూపించారు అలాగే ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. కాకపోతే కథనం నెమ్మదిగా అనిపించింది. మ్యూజిక్ కూడా సో సో గానే ఉంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:20 AM Feb 10, 2023
-
ఇప్పుడు ఓ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ సీన్ మంచి స్టైలిష్ గా ఉండగా కళ్యాణ్ రామ్ అదరగొడుతున్నాడు. తర్వాత ఓ సింపుల్ ట్విస్ట్ తో సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 08:10 AM Feb 10, 2023
-
పలు ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి.కళ్యాణ్ రామ్ ఈ సీన్స్ లో మరింత ఆసక్తిగా కనిపిస్తున్నాడు.
Date & Time : 08:00 AM Feb 10, 2023
-
ఇప్పుడు హీరోయిన్ మరియు ముగ్గురు డోప్లాంగర్స్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ వస్తుంది.
Date & Time : 07:50 AM Feb 10, 2023
-
ఇప్పుడు ముగ్గురు డోప్లాంగర్స్ గోవా లో మీట్ అయ్యిన సన్నివేశాలు వేస్తున్నాయి. అలాగే వారిపై ఏక ఏక సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:40 AM Feb 10, 2023
-
ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సన్నివేశం తర్వాత కథనంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 07:30 AM Feb 10, 2023
-
ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఓ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.అలాగే హీరోయిన్ ఆషికా రంగనాథ్ పై కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:20 AM Feb 10, 2023
-
హాయ్..139 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 07:10 AM Feb 10, 2023