'అఖండ 2 - తాండవం'
'Akhanda 2 Thaandavam' Live updates in English Version
మొదటి షో వివరాలు : 'అఖండ 2 - తాండవం'
సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌తో సినిమా ముగింపు దశకు చేరుకుంటోంది.
ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్‌తో ఓ అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ట్విస్టుతో థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది.
సనాతన ధర్మంపై అఖండ పవర్‌ఫుల్ డైలాగులు బాగున్నాయి. ఇప్పుడు మరోసారి ఆది-బాలయ్య ఫేస్ టు ఫేస్ ఎదుర్కొంటున్నారు.
ఓ పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నేత్ర(ఆది పినిశెట్టి) అఖండ ఎదురైన ఎపిసోడ్ చూపెడుతున్నారు.
సెకండాఫ్ లో కొన్ని డ్రామాటిక్ సన్నివేశాల తర్వాత ఓ భయంకరమైన తాంత్రికుడిగా ఆది పినిశెట్టి పరిచయం అయ్యాడు. కథలో ఇప్పుడు అతడికి సంబంధించిన సీక్వెన్స్‌లు వస్తున్నాయి.
ఫస్ట్ హాప్ రిపోర్ట్ : సినిమా ఇప్పటివరకు డీసెంట్‌గా సాగింది. అభిమానులను ఇంప్రెస్ చేసే యాక్షన్ బ్లాక్స్, థమన్ థండరింగ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. అఖండ పాత్రలో బాలయ్య మరోసారి అదరగొట్టాడు. ఇక సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఉద్రిక్తను సృష్టించిన దుండగులపై అఖండ విరుచుకుపడ్డాడు. అదిరిపోయే యాక్షన్ బ్లాక్, భారీ సౌండ్‌ట్రాక్, బాలయ్య లుక్ అన్ని కలిపి అదిరిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి. ఇంటర్వెల్ తో కథ సగానికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న అనుకోని ఘటన కలకలం రేపి, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటాయి.
కొన్ని సరదా సన్నివేశాల తర్వాత ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘జాజికాయ’ వస్తుంది. పాట తర్వాత కథ ఓ మలుపు తీసుకుంది.
సంయుక్త, హర్షాలి మల్హోత్రా పాత్రలు పరిచయం అయ్యాయి. కబీర్ దుహాన్ సింగ్ ఓ భారతీయ రాజకీయ నేతగా పరిచయం అయ్యారు.
మురళీకృష్ణ పాత్రలో బాలయ్య ఓ డైనమిక్ ఫైట్ సీక్వెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు. మాస్ సీన్స్‌తో అదరగొడుతున్నాడు.
పవర్‌ఫుల్ ఇంట్రొడక్షన్ తర్వాత, టైటిల్స్ పడ్డాయి. ఇక కథ ఇప్పుడు టిబెట్ బోర్డర్‌కు షిఫ్ట్ అవుతుంది. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
అఖండ చిత్రానికి సంబంధించి ఓ చిన్న రీక్యాప్‌తో అఘోర అవతారంలో బాలయ్య పరిచయం అయ్యాడు. ఆయన పాత్రకు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
హాయ్.. 2 గంటల 45 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే ప్రారంభం అయింది. సినిమా హాలు పూర్తిగా అభిమానులతో కిక్కిరిసిపోయింది.