-
ఎట్టకేలకు సినిమా కంప్లీట్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 07:05 AM December 02, 2021
-
ఇప్పుడు ఇద్దరు బాలయ్య లతో కలిపి ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:55 AM December 02, 2021
-
సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా బాలయ్య కేవలం యాక్షన్ సీక్వెన్స్ లతోనే నడిపిస్తున్నాడు.
Date & Time : 06:45 AM December 02, 2021
-
ఇప్పుడు సినిమా టైటిల్ సాంగ్ "అఖండ" స్టార్ట్ అయ్యింది. బాలయ్య మాత్రం తన కొత్త అవతార్ లో హైలైట్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 06:30 AM December 02, 2021
-
ఇప్పుడు బాలయ్య మరియు శ్రీకాంత్ మధ్య మరో ఫైట్ సీన్ వస్తుంది. తన రోల్ లో శ్రీకాంత్ చాలా బాగా సెట్టయ్యాడు.
Date & Time : 06:30 AM December 02, 2021
-
ఈ ఎమోషనల్ సీన్స్ తో సినిమా కాస్త స్లో అయ్యినట్టు అనిపిస్తుంది.
Date & Time : 06:15 AM December 02, 2021
-
ఇప్పుడు బాలయ్య మరియు తన తల్లికి సంబంధించిన సన్నివేశాలతో సినిమా కాస్త ఎమోషనల్ యాంగిల్ లో మారింది.
Date & Time : 06:10 AM December 02, 2021
-
ఈ మైనింగ్ స్కాం చుట్టూతా అంతా ఓ స్వామీజీ వెనకుండి నడిపిస్తున్నాడు. ఈ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే బాలయ్య పై ప్రతీ ఎలివేషన్ సీన్ కూడా చాలా బాగుంది.
Date & Time : 06:00 AM December 02, 2021
-
ఇంటర్వెల్ అనంతరం.. అఖండ బాలయ్య ఇప్పుడు అంతా తానై నడిపిస్తున్నాడు. ఓ పోలీస్ స్టేషన్ లో మరో యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది.
Date & Time : 05:50 AM December 02, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పుడు వరకు అఖండ ఫస్ట్ హాఫ్ మంచి పవర్ ఫుల్ గా ఉంది. కొంచెం నిడివి ఎక్కువగా అనిపించినా బాలయ్య మాత్రం రెండు గెటప్స్ లో అదరగొట్టేసారు. కథలో కొత్తదనం లేకపోయినా బోయపాటి ప్రెజెంటేషన్ మాత్రం ప్రతి ఒక్కరినీ థ్రిల్ చేస్తుంది. ఓ బిగ్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:40 AM December 02, 2021
-
ఈ వెర్షన్ బాలయ్య 'అఖండ'మైన ఎంట్రీతో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఇప్పుడు విరామం.
Date & Time : 05:35 AM December 02, 2021
-
ఇపుడు ఒక ఛేజింగ్ సన్నివేశం. బాలయ్య జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మరో బాలయ్య(అఘోర) ఎంట్రీ. అదిరే గెటప్ లో ఓ మాసివ్ బ్యాంగ్ తో ఈ బాలయ్య ఎంట్రీ వచ్చింది.
Date & Time : 05:30 AM December 02, 2021
-
ఇప్పుడు కథనంలో ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలయ్య కొన్ని సమస్యల్లో పడ్డాడు, సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుతుంది.
Date & Time : 05:20 AM December 02, 2021
-
ఆ మైనింగ్ మూలాన ప్రజలు సైడ్ ఎఫెక్ట్స్ తో చనిపోతున్నారు. దీనికి అడ్డుగా నిలబడేందుకు బాలయ్య ముందుకొచ్చాడు. ఇప్పుడు ఇంకో మాసివ్ ఫైట్ మొదలైంది.
Date & Time : 05:10 AM December 02, 2021
-
ఇప్పుడు బాలయ్య మరియు ప్రగ్యా ల మధ్య కొన్ని ఫన్ సీన్స్ అనంతరం సినిమాలో సర్ప్రైజింగ్ సాంగ్ జై బాలయ్య స్టార్ట్ అయ్యింది. బాలయ్య క్రేజీ స్టెప్స్ తో మరోసారి థియేటర్ షేక్ అవుతుంది.
Date & Time : 04:50 AM December 02, 2021
-
సినిమాలో మెయిన్ విలన్ గా శ్రీకాంత్ ఇప్పుడు ఒక పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. తన గెటప్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సాలిడ్ గా ఉన్నాయి.
Date & Time : 04:45 AM December 02, 2021
-
ప్రగ్యా బాలయ్య పట్ల మనసు పారేసుకుంది. ఇప్పుడు ఓ మైనింగ్ స్కామ్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:40 AM December 02, 2021
-
ఇప్పుడు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒక జిల్లా కలెక్టర్ గా తన ఎంట్రీ ఇచ్చింది. అలానే తన సబ్ ఆర్డినేట్ గా నటి పూర్ణ కనిపిస్తుంది.
Date & Time : 04:25 AM December 02, 2021
-
ఇప్పుడు బాలయ్య మాసివ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. అనంతపూర్ లో ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ తో తన ఎంట్రీ..చూసి ఫ్యాన్స్ సంబరాలు చేస్తున్నారు.
Date & Time : 04:20 AM December 02, 2021
-
ఇప్పుడు ఒక ఇద్దరు కవలలు పుట్టిన సన్నివేశం వస్తుంది. అలాగే ఒక ఋషి గా జగపతిబాబు పాత్ర ఇపుడు ఎంటర్ అయ్యింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెర్రిఫిక్ గా ఉంది.
Date & Time : 04:15 AM December 02, 2021
-
అఖండ గా బాలయ్య టైటిల్ రోర్ థియేటర్ లో అదిరిపోయింది. ఇప్పుడు ఒక క్రిమినల్ కి సంబంధించి ఓ సీరియస్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 04:10 AM December 02, 2021
-
హాయ్.. ఫైనల్ గా బాలకృష్ణ నటించిన అఖండ తో ఈ బిగ్ రిలీజ్ వచ్చేసింది. మేము హైదరాబాద్ నుంచి స్పెషల్ షో తో లైవ్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాము. 162 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:00 AM December 02, 2021