-
కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ అనంతరం మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 06:05 AM March 4, 2022
-
చిరు ఇంకా తన కూతురు ఆద్యలు ప్రేమలో ఉన్నట్టుగా ఖుష్బూ కి తెలిసింది. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా కొనసాగుతుంది.
Date & Time : 05:52 AM March 4, 2022
-
చిరు సహాయంతో ఖుష్బూ ఇంప్రెస్ అయ్యింది. దీనితో చిరు ని అతని ఫ్యామిలీ తో తన ఇంటికి రావాలని కోరింది. ఇప్పుడు మరికొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:45 AM March 4, 2022
-
ఇప్పుడు చిరు, ఆద్య మరియు వెన్నెల కిషోర్ లు ఒక గ్రామంలో ఉన్న సమస్యని సాల్వ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఓ కీలక ఫైట్ సీన్ అనంతం శర్వానంద్ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెబుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:35 AM March 4, 2022
-
ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ తర్వాత కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 05:25 AM March 4, 2022
-
ఆద్య ఫ్రెండ్ సాయంతో చిరు, ఆద్య తల్లి ఫ్యాక్టరీ లో జాయిన్ అయ్యాడు. ఆ సంబంధిత కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM March 4, 2022
-
బాగా డిజప్పాయింట్ అయ్యిన చిరు వెన్నెల కిషోర్ తో ఓ బార్ కి వెళ్ళాడు. ఇక్కడ సినిమా టైటిల్ సాంగ్ 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' మొదలైంది.
Date & Time : 04:55 AM March 4, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ~: ఇప్పటి వరకు సినిమా డీసెంట్ గా నడిచింది అని చెప్పాలి. శర్వా మరియు రష్మికా ల జంట ఆన్ స్క్రీన్ బాగుంది. ఇద్దరి నటన, కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. పాటలు కూడా బాగున్నాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 04:50 AM March 4, 2022
-
ఇప్పుడు వీరిద్దరూ ఓ కారణం చేత విడిపోయారు. ఆద్య చిరుని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదో తెలుపుతున్న సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు విరామం.
Date & Time : 04:40 AM March 4, 2022
-
మెయిన్ లీడ్ మధ్య కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ తర్వాత వారు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు 'ఓ మై ఆద్య' సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 04:30 AM March 4, 2022
-
ఆద్య(రష్మికా) శర్వానంద్ ని మరోసారి కలిసింది. మరికొన్ని కామెడీ సీన్స్ మెయిన్ లీడ్ మధ్య వస్తున్నాయి.
Date & Time : 04:15 AM March 4, 2022
-
ఇప్పుడు శర్వానంద్ ఓ గుడికి వచ్చాడు. అక్కడే హీరోయిన్ రష్మికా మందన్నా ని చూసాడు. ఇద్దరి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:10 AM March 4, 2022
-
పెళ్లి కూతురు తండ్రిగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు. ఓ రైల్వే స్టేషన్ లో శర్వానంద్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి..
Date & Time : 04:05 AM March 4, 2022
-
ఇప్పుడు శర్వానంద్ కి పెళ్ళిచూపుల సన్నివేశాలు వస్తున్నాయి, తన కుటుంబ అతి ప్రేమ వల్ల తనకి కొన్ని పెళ్లి సంబంధాలు చెడి పోతున్నాయి
Date & Time : 03:59AM March 04, 2022
-
హాయ్..141 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:55 AM March 04, 2022