-
-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:25 AM May 17, 2019
-
చివరకు శిరీష్ తన ప్రత్యర్థిని ఓడించి యూత్ ఐకాన్ అవార్డును తాను సొంతం చేసుకున్నాడు.
Date & Time : 07:18 AM May 17, 2019
-
ఇప్పుడు శిరీష్ తన ప్రత్యర్థి(ఆ రాజకీయ నాయకుడి కొడుకు)కు సంబంధించి యూత్ ఐకాన్ పోటీ ఫైనల్స్ లో అన్ని దారులు మూసేసాడు.
Date & Time : 06:57 AM May 17, 2019
-
శిరీష్ తన కాలనీ ప్రజలలో మరింత పేరు తెచ్చుకుంటూ అక్కడి రాజకీయ నాయకునికి మరింత తలనొప్పిగా మారుతున్నాడు.
Date & Time : 06:50 AM May 17, 2019
-
ఇప్పుడు ఈ ఆల్బంలోని మంచి హిట్ అయిన మెల్ల మెల్లగా సాంగ్ ఇద్దరి మధ్యన వస్తుంది...
Date & Time : 06:34 AM May 17, 2019
-
ఆ కాలేజీ లోని విద్యార్థుల సమస్యలను తీర్చే క్రమంలో అక్కడ శిరీష్ ఫేమస్ గా మారిపోయాడు.
Date & Time : 06:30 AM May 17, 2019
-
ఆ కాలేజ్ లో హీరోయిన్ రుక్షర్, శిరీష్ క్లాస్ మేట్ గా కనిపిస్తుంది.ఇద్దరి మధ్య కొన్ని చక్కని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM May 17, 2019
-
ఇంటర్వెల్ అనంతరం కొన్ని కాలేజ్ పొలిటికల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:15 AM May 17, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా మొదటి సగం పూర్తయ్యే సరికి పర్వాలేదనిపించే స్థాయిలో మంచి కామెడీ సన్నివేశాలతో సజావుగానే సాగింది.మరి సెకండాఫ్ సినిమాకు ఏమన్నా కీలకంగా మారుతుందో లేదో చూడాలి.
Date & Time : 06:10 AM May 17, 2019
-
నాగబాబు వల్ల తప్పని సరి పరిస్థితుల్లో హైదరాబాద్ లో శిరీష్ ఎంబీఏ చెయ్యడానికి అంగీకరించాడు.మరో ఆప్షన్ లేకపోవడంతో శిరీష్ మరియు భరత్ లు లోకల్ ఎంబీఏ కాలేజీ లో చేరారు.ఇప్పుడు విరామం.
Date & Time : 06:01 AM May 17, 2019
-
ఇప్పుడు సిరీస్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిటినీ చిత్రీకరిస్తూ అమెరికా నా అమెరికా పాట వస్తుంది.
Date & Time : 05:45 AM May 17, 2019
-
శిరీష్ బ్యాంక్ కార్డ్స్ అన్నీ రద్దు అయ్యేపోయ్యాయి.అది తన తండ్రి ప్లానే అని శిరీష్ తెలుసుకున్నాడు,ఇప్పుడు శిరీష్ మరియు భరత్ లు స్టార్ హోటల్ స్థాయి నుంచి స్లమ్ ఏరియాకు మారాల్సి వచ్చింది,కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:38 AM May 17, 2019
-
ఇప్పుడు శిరీష్ మరియు భరత్ హైదరాబాద్ లో ఉన్నారు..హీరోయిన్ రుక్షర్ ధిలాన్ ను శిరీష్ ఓ షాపింగ్ మాల్ దగ్గర చూసాడు.ఆమెను ఇంప్రెస్స్ చెయ్యడానికి శిరీష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 05:31 AM May 17, 2019
-
పార్లెల్ గా కొన్ని రాజకీయ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:21 AM May 17, 2019
-
ఇప్పుడు నాగబాబు శిరీష్(అవి) మరియు భరత్(బాషా)లను అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకొమ్మని ఇండియా పంపించారు.
Date & Time : 05:16 AM May 17, 2019
-
ఇప్పుడు శిరీష్ తండ్రిగా నాగబాబు పరిచయం అయ్యారు.
Date & Time : 05:09 AM May 17, 2019
-
కొన్ని సన్నివేశాల అనంతరం సినిమా న్యూయార్క్ కు షిఫ్ట్ అయ్యింది.అల్లు శిరీష్ మరియు భరత్ లు ఒక పబ్ లో ఏబీసీడీ టైటిల్ ట్రాక్ తో పరిచయం అయ్యారు.
Date & Time : 05:05 AM May 17, 2019
-
స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక న్యూస్ రీడర్ గా పరిచయం అయ్యారు.ఆ సంబంధిత కొన్ని పేరడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:00 AM May 17, 2019
-
హాయ్..150 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:54 AM May 17, 2019