-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:33 AM March 05, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ టైం..లాస్ట్ హాకీ గేమ్ మంచి థ్రిల్లింగ్ సహా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. వీటితో పాటు కామెడీ ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి.
Date & Time : 11:20 AM March 05, 2021
-
ఈ మ్యాచ్ సీన్ లో గ్రౌండ్ విజువల్స్ కానీ కెమెరా వర్క్ కానీ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఇపుడు సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:10 AM March 05, 2021
-
ఇప్పుడు అసలైన హాకీ మ్యాచ్ కు టైం వచ్చింది. ఓ పెద్ద సెటప్ తో ఇదంతా కనిపిస్తుంది. అక్కడ కామెంట్రేటర్స్ గా సుమ, వైవా హర్షలు కనిపిస్తున్నారు. ఈ మ్యాచ్ విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 11:05 AM March 05, 2021
-
ఇప్పుడు ఆ గ్రౌండ్ ను కాపాడేందుకు సందీప్ మళ్ళీ టీం లో జాయిన్ అవ్వడానికి సిద్ధం అయ్యాడు.
Date & Time : 11:00 AM March 05, 2021
-
ఇప్పుడు ఆ గ్రౌండ్ కు సంబంధించి ఒక భారీ ఫైట్ సన్నివేశం వస్తుంది. ఇక్కడ కూడా ఎమోషన్స్ బాగున్నాయి.
Date & Time : 10:55 AM March 05, 2021
-
ఇందులో గేమ్ కన్నా దానిపై లోకల్ పాలిటిక్సే బాగా ఎలివేట్ అవుతున్నాయి. రావు రమేష్ తన రోల్ లో చాలా బాగా కనిపిస్తున్నారు.
Date & Time : 10:50 AM March 05, 2021
-
ఇప్పుడొక విపరీతమైన భావోద్వేగ సన్నివేశం వస్తుంది. ఇందులో సందీప్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు.
Date & Time : 10:40 AM March 05, 2021
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇప్పుడు పరిచయం అయ్యారు. ఓ ఫన్నీ హాకీ ట్రైనింగ్ సీన్ వీరి నడుమ వస్తుంది.
Date & Time : 10:35 AM March 05, 2021
-
ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ హిట్ ట్రాక్ సింగిల్ కింగులం స్టార్ట్ అయ్యింది. ఇందులో సందీప్ డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి.
Date & Time : 10:30 AM March 05, 2021
-
సందీప్ విషయంలో తాను ఒక హాకీ ప్లేయర్ అని చెప్పకపోడంతో లావణ్య కాస్త అప్సెట్ అయ్యింది.
Date & Time : 10:25 AM March 05, 2021
-
ఇంటర్వెల్ అనంతరం మురళీ శర్మ మళ్ళీ తన గ్రౌండ్ ను కాపాడుకోవాలని డిసైడ్ అయ్యారు. దానికి కనిపిస్తున్న ఒకే మార్గం ఓ టోర్నమెంట్ ను పెట్టడం. ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM March 05, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు అంతా ఓకే అని చెప్పొచ్చు. నీట్ కామెడీ మరియు కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ పాయింట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలవ్వనుంది. ఇదెలా ఉంటుందో చూడాలి ఇక.
Date & Time : 10:15 AM March 05, 2021
-
సందీప్ కిషన్ పై ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 10:10 AM March 05, 2021
-
ఇప్పుడు ఓ ఆసక్తికర హాకీ మ్యాచ్ కు టైం..సందీప్ తన గేమింగ్ స్కిల్స్ తో లావణ్యను మెస్మరైజ్ చేసాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 10:05 AM March 05, 2021
-
ఇప్పుడు హాకీ గేమ్ పై ఒక ఆసక్తికర సన్నివేశం వస్తుంది. లావణ్య ఓ సమస్యను ఎదుర్కొంటుండగా సందీప్ ఆమెకి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 10:00 AM March 05, 2021
-
ఓ హాకీ కోచ్ గా మురళీ శర్మ ఇప్పుడే ఎంటర్ అయ్యారు. అలాగే తన గ్రౌండ్ ను ఒక కార్పొరేట్ కంపెనీకి అమ్మేసారు. ఇప్పుడు రావు రమేష్ మరియు మురళీ శర్మల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది.
Date & Time : 09:50 AM March 05, 2021
-
లావణ్య కూడా హాకీ ప్లేయర్ గా కనిపిస్తుంది. సందీప్ ఆమె విషయంలో బాగానే ట్రై చేస్తున్నాడు. మరో పక్క ఈ పాత్రలు అన్ని ఓ గ్రౌండ్ కు రిలేటెడ్ గా కనిపిస్తున్నాయి. రావు రమేష్ తన రోల్ లో సూపర్బ్ గా కనిపిస్తున్నారు.
Date & Time : 09:40 AM March 05, 2021
-
ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఎంటర్ అయ్యింది. ఒక టామ్ బాయ్ రోల్ టైప్ లో ఆమె కనిపిస్తుంది. హీరో ఆమెను చూసిన ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు మొదటి సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 09:30 AM March 05, 2021
-
ఓ సింపుల్ ఎంట్రీతో సందీప్ కిషన్ పరిచయం అయ్యాడు. అలాగే పోసాని, బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా యాడ్ అయ్యారు.
Date & Time : 09:20 AM March 05, 2021
-
యానాం లో షాట్స్ తో సినిమా మొదలయింది. హాకీ గ్రౌండ్ కోసం మాట్లాడుతున్న ఓ లోకల్ పొలిటీషియన్ గా రావు రమేష్ పరిచటం అయ్యారు.
Date & Time : 09:10 AM March 05, 2021
-
హాయ్..138 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM March 05, 2021