-
సినిమా ఒక ఆసక్తికరమైన క్లైమాక్స్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.
Date & Time : 11:30 AM July 22, 2016
-
ఆసక్తికరమైన క్లైమాక్స్ ఎపిసోడ్ మొదలైంది. రజనీ ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ డైలాగులతో అదరగొడుతున్నాడు.
Date & Time : 11:20 AM July 22, 2016
-
సినిమా మలేషియాకు మారింది. జియాంగ్ వార్ మళ్లీ మొదలై రజనీకి సన్నిహితులు ఒక్కొక్కరు దూరమవుతున్నారు. కథలో ట్విస్ట్ చోటు చేసుకుని క్లైమాక్స్ వైపుకు నడుస్తోంది.
Date & Time : 11:10 AM July 22, 2016
-
సినిమా ఎమోషనల్ గా సాగుతోంది. అందమైన మాంటేజ్ సాంగ్ నడుస్తోంది.
Date & Time : 11:00 AM July 22, 2016
-
రజనీకాంత్, అతని భార్య రాధికా ఆప్టే ల మీద కొన్ని కీలక సన్నివేశాలు నడుస్తున్నాయి. సినిమా కీలక అంకానికి చేరుకుంది.
Date & Time : 10:55 AM July 22, 2016
-
కథ ఇండియాకు మారింది. మళ్లీ గ్యాంగ్ వార్స్ మొదలయ్యాయి.
Date & Time : 10:45 AM July 22, 2016
-
ఇంటర్వెల్ తరువాత కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు నడుస్తున్నాయి. పగ తీర్చుకోవడానికి రజనీ ప్లాన్ చేస్తున్నాడు.
Date & Time : 10:35 AM July 22, 2016
-
కథలో ఆసక్తికరమైన, కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది.బ్రేక్ పడింది.
Date & Time : 10:20 AM July 22, 2016
-
ధన్సిక ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. భావోద్వేగపూరితమైన రజనీ ఫ్లాష్ బ్యాక్ ముగింపుకు వచ్చింది. సినిమా థాయ్ లాండ్ కు మారింది.
Date & Time : 10:10 AM July 22, 2016
-
సీరియస్ గ్యాంగ్ వార్ డ్రామా నడుస్తోంది. రజనీ పై సీక్రెట్ మర్డర్ ప్లాన్ జరిగింది.
Date & Time : 10:05 AM July 22, 2016
-
రజనీ, రాధికా ఆప్టే ల మధ్య కొన్ని ప్రతిఘటన సన్నివేశాలు జరుగుతున్నాయి. కథ గతంలోకి వెళుతోంది.
Date & Time : 10:00 AM July 22, 2016
-
రాధికా ఆప్టే, నాజర్ లు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:50 AM July 22, 2016
-
కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. మలేషియాలో తమిళుల హక్కుల కోసం రజనీ పోరాడుతున్నాడు.
Date & Time : 09:45 AM July 22, 2016
-
సినిమా సీరియస్ గా సాగుతోంది. గ్యాంగ్ వార్స్, డ్రగ్ మాఫియాలకు సంబందించిన సన్నివేశాలు నడుస్తున్నాయి. రజనీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది.
Date & Time : 09:40 AM July 22, 2016
-
మొదటి పాట నడుస్తోంది. అభిమానులు కోలాహలంగా డ్యాన్సులు చేస్తున్నారు. డ్యాన్సుల్లో రజనీ స్టైల్ అద్భుతంగా ఉంది.
Date & Time : 09:30 AM July 22, 2016
-
రజనీ ఫైట్ ఇప్పుడే మొదలైంది. ఫైటింగ్ లో రజనీ తన ట్రేడ్ మార్క్ యాక్షన్ చూపుతున్నారు.
Date & Time : 09:15 AM July 22, 2016
-
రజనీకాంత్ జైల్లో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. రజనీని చూసి అభిమానులు మైమరచిపోతున్నారు.
Date & Time : 09:08 AM July 22, 2016
-
సినిమా మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతోంది. కబాలి గురించిన ఇంట్రడక్షన్ జరుగుతోంది.
Date & Time : 09:02 AM July 22, 2016
-
సినిమా రన్ టైమ్ 150 నిముషాలుగా ఉంది. అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
Date & Time : 08:58 AM July 22, 2016
-
'కబాలి' సినిమా ఇప్పుడే మొదలైంది. సినిమా హాల్ మొత్తం రజనీకాంత్ అభిమానులతో నిండిపోయి ఉంది.
Date & Time : 08:55 AM July 22, 2016