-
ఇప్పుడే క్లైమాక్స్ పూర్తైంది. రావు రమేష్ స్టైల్ పంచ్ డైలాగ్స్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూనే ఉండండి.
Date & Time : 05:40 AM September 30, 2016
-
ప్రస్తుతం క్లైమాక్స్ నడుస్తోంది. రావు రమేష్ తన డైలాగ్స్‌తో కట్టిపడేస్తున్నాడు.
Date & Time : 05:35 AM September 30, 2016
-
కథలో ట్విస్ట్‌లన్నీ రివీల్ అయిపోయాయి. రావు రమేష్, రామ్‌లు ఎదురెదురుగా పోట్లాడుకునే సందర్భం దగ్గరైంది.
Date & Time : 05:30 AM September 30, 2016
-
లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ సీఎంగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతోంది.
Date & Time : 05:25 AM September 30, 2016
-
రాశి ఖన్నా మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హైపరే హైపరే అంటూ ఓ పాట వస్తోంది. ఈ మాస్ నెంబర్లో రామ్ తన డ్యాన్స్‌తో అదరగొడుతున్నాడు.
Date & Time : 05:20 AM September 30, 2016
-
రావు రమేష్, రామ్‌ల ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంది. హాస్పిటల్ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM September 30, 2016
-
కథలో ఇప్పుడే ఓ ట్విస్ట్ వచ్చి చేరింది. రామ్ కుటుంబం ఇబ్బందుల్లో చిక్కుకునే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:05 AM September 30, 2016
-
రావు రమేష్, రామ్ ఇద్దరి మధ్యన పిల్లి-ఎలుక తరహాలో ఆటలు సాగుతున్నాయి.
Date & Time : 05:00 AM September 30, 2016
-
రామ్, రావు రమేష్ ఇద్దరూ పోటాపోటీగా నటించేస్తూ హీరో-విలన్ పోటీకి తెరలేపుతున్నారు.
Date & Time : 04:55 AM September 30, 2016
-
ప్రస్తుతం బేబీ డాల్ అంటూ మరో పాట వస్తోంది. వెస్ట్రన్ డ్రెస్సులో రాశిఖన్నా చాలా బాగుంది. రామ్ తన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 04:45 AM September 30, 2016
-
ఇప్పుడే సుమన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ యాంగిల్లో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:40 AM September 30, 2016
-
రామ్, రావు రమేష్‌ల మధ్యన ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ సీన్ వస్తోంది. ఇద్దరూ తమ తమ డైలాగ్స్‌తో హీట్ పెంచుతున్నారు.
Date & Time : 04:30 AM September 30, 2016
-
ఇంటర్వెల్ తర్వాత ప్రస్తుతం ఓ ఛేజింగ్ సీన్ వస్తోంది. రావు రమేష్‌పై పోరాటానికి రామ్ సిద్ధమయ్యే సన్నివేశం నడుస్తోంది.
Date & Time : 04:22 AM September 30, 2016
-
భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగులతో ఇప్పుడే ఎనర్జిటిక్ లెవెల్లో ఇంటర్వెల్ బ్లాక్ పడింది.
Date & Time : 04:11 AM September 30, 2016
-
ప్రస్తుతం మురళి శర్మ, రాంల మధ్యన ఓ ఆసక్తికర సన్నివేశం నడుస్తోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అయింది.
Date & Time : 04:00 AM September 30, 2016
-
రామ్, రాశిఖన్నా ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. ప్రస్తుతం ఒంపుల ధనియా అంటూ ఓ పాట వస్తోంది.
Date & Time : 03:55 AM September 30, 2016
-
ఇప్పుడే రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. సత్య రాజ్, రావు రమేష్‌ల మధ్యన ఓ ఆసక్తికర సన్నివేశం వస్తోంది. రావు రమేష్ తన డైలాగ్ డెలివరీతో కట్టిపడేస్తున్నాడు.
Date & Time : 03:45 AM September 30, 2016
-
నాలో నేనేనా అంటూ ప్రస్తుతం రెండో పాట వస్తోంది. రాశిఖన్నా ఈ పాటలో పూర్తిగా స్టైలిష్ అమ్మాయిగా మారిపోయింది.
Date & Time : 03:40 AM September 30, 2016
-
గజ పేరుగల ఓ రౌడీగా మురళి శర్మ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. సత్య రాజ్, మురళి శర్మల నేపథ్యంలో ప్రస్తుతం ఓ సన్నివేశం వస్తోంది.
Date & Time : 03:35 AM September 30, 2016
-
ప్రస్తుతం మొదటి పాట 'కమ్ బ్యాక్ కమ్ బ్యాక్' వస్తోంది. వైజాగ్ బీచ్ పరిసరాల్లో వస్తోన్న ఈ పాటలో రామ్ తన స్టెప్పులతో అదరగొడుతున్నాడు.
Date & Time : 03:30 AM September 30, 2016
-
రాశిఖన్నా ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గుడికి సంబంధించిన నేపథ్యంలో రామ్, సత్యరాజ్, రాశిఖన్నాల మధ్యన ఓ సన్నివేశం వస్తోంది.
Date & Time : 03:20 AM September 30, 2016
-
రామ్, ట్రాఫిక్ పోలీసుల నేపథ్యంలో ప్రస్తుతం ఓ కామెడీ సన్నివేశం వస్తోంది. ఈ సీన్‌తో రామ్ క్యారెక్టరైజేషన్‌ను పూర్తిగా పరిచయం చేశారు.
Date & Time : 03:10 AM September 30, 2016
-
ప్రస్తుత కాలానికి వచ్చిన సినిమాలో రామ్ ఇప్పుడే స్టైలిష్ ఎంట్రీ ఇచ్చేశాడు. అతడి హైపర్ క్యారెక్టర్‌కి తగ్గట్టే ఇంట్రడక్షన్ ఉంది.
Date & Time : 03:09 AM September 30, 2016
-
రామ్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాలు కొన్ని వస్తున్నాయి. తండ్రంటే విపరీతమైన ప్రేమ ఉన్న పాత్రగా రామ్ పాత్ర పరిచయమవుతూ ఉంది.
Date & Time : 03:06 AM September 30, 2016
-
సత్య రాజ్, తులసి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తులసి డెలివరీకి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:02 AM September 30, 2016
-
143 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:00 AM September 30, 2016