-
-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:14 AM July 21, 2017
-
హీరో మరియు హీరోయిన్ల మధ్య సుదీర్ఘ సంభాషణ తరువాత చివరకు సాయి పల్లవి వరుణ్ ని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. హ్యాపీ నోట్ తో చిత్రం పూర్తయ్యింది.
Date & Time : 06:10 AM July 21, 2017
-
వరుణ్ సాయి పల్లవిని ఒప్పించడానికి ఇండియాకి వచ్చాడు.. ప్రస్తుతం ఇద్దరి మధ్య బావోద్వేకమైన సంభాషణలు జరుగుతున్నాయి..
Date & Time : 06:06 AM July 21, 2017
-
మూవీ ఆసక్తికరంగా క్లయిమాక్స్ దిశగా సాగుతోంది.. లీడ్ పెయిర్ మధ్య మంచి హార్డ్ ఎమోషనల్ లవ్ డ్రామాగా కథ నడుస్తోంది..
Date & Time : 06:00 AM July 21, 2017
-
సాయి పల్లవి తిరిగి ఇండియాకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది.. మంచి బావోద్వేకమైన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.. ప్రస్తుతం ఎదో జరుగుతోంది సాంగ్ వస్తోంది.
Date & Time : 05:50 AM July 21, 2017
-
సాయి పల్లవి అనూహ్యంగా హర్షవర్ధన్ పెళ్లి ప్రపోజల్ ని అంగీకరిస్తుంది.. ఆ తర్వాత ఆమె తండ్రి విజ్ఞప్తి మేరకు అమెరికాకు వస్తుంది.. ప్రస్తుతం ప్రధాన పాత్రల మధ్య కొన్ని కామెడి సిన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:35 AM July 21, 2017
-
వరుణ్ వదిన, సాయి పల్లవిని ఒప్పించేందుకు చాలా కష్టపడుతోంది.. ప్రస్తుతం సిస్టర్స్ మధ్య కొన్ని సీరియస్ సంభాషణలు కొనసాగుతున్నాయి.
Date & Time : 05:26 AM July 21, 2017
-
సాయి పల్లవి, వరుణ్ ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తోంది... కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి..
Date & Time : 05:20 AM July 21, 2017
-
ఇంకొక వైపు వరుణ్ హీరోయిన్ నుండి తన ప్రేమను స్వీకరించడానికి కష్టపడి ప్రయత్నిస్తున్నాడు ... కొన్ని కుటుంబ నేపధ్య దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:16 AM July 21, 2017
-
పాట పూర్తయ్యింది.. నటుడు హర్షవర్ధన్ సీన్లోకి అడుగుపెట్టాడు మరియు మొదటిసారిగా హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు.. వివాహం చేసుకోవడానికి ఆమె వద్దకి చేరతాడు.
Date & Time : 05:12 AM July 21, 2017
-
విరామం తర్వాత వరుణ్ అమెరికాకు తిరిగి వెళుతుండగా, సాయి పల్లవిని జ్ఞాపకంలో ఉండిపోయాడు.. ప్రస్తుతం "ఉసు పోదు" పాట వస్తోంది.
Date & Time : 05:08 AM July 21, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో చిత్రం బావుంది.. సాయి పల్లవి నటన మరియు వరుణ్ తో ఆమె కెమిస్ట్రీ మొదటి భాగానికి ప్లస్ పాయింట్స్.
Date & Time : 05:04 AM July 21, 2017
-
ఒక చిన్న ఎమోషనల్ ఎపిసోడ్ తో చిత్రం సగం పూర్తయ్యింది.. ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:58 AM July 21, 2017
-
వివాహ కార్యక్రమం పూర్తయ్యింది. వరుణ్ బ్రదర్ తన కుటుంబంతో అమెరికాకు వెళ్ళాడు...ఇప్పుడు ప్రధాన జంటల మధ్య కొన్ని అందమైన సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 04:56 AM July 21, 2017
-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత సాయి పల్లవి వరుణ్ కి పడిపోతుంది.. ఇప్పుడు మూడవ పాట హే పిల్లగాడా వస్తోంది. గ్రామ నేపథ్యంలో ఈ పాట సెటప్ చేయబడింది
Date & Time : 04:45 AM July 21, 2017
-
పాట పూర్తయింది... ఇప్పుడు ప్రధాన జంట మధ్య కొన్ని కామెడీ సీన్స్ జరుగుతున్నాయి... సాయి పల్లవి పాత్ర మరియు తెలంగాణ యాసలో ఆమె మాటలు చాలా బాగున్నాయి.
Date & Time : 04:35 AM July 21, 2017
-
ప్రస్తుతం పెళ్లి సన్నివేశాలతో కూడిన సమయంలో వచ్చిందే సాంగ్ వస్తోంది..వివాహానికి సంబంధించిన సన్నివేశాలను అందంగా తెరకెక్కించారు..
Date & Time : 04:27 AM July 21, 2017
-
హీరో సోదరుడు, హీరోయిన్ సిస్టర్ ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు.. వరుణ్ కూడా ఇండియాలోనే ఉండిపోయాడు ...ప్రస్తుతం కొన్ని ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 04:18 AM July 21, 2017
-
ఆహ్లాదకరమైన గ్రామ వాతావరణంలో కొన్ని ఫన్నీ సీన్స్ ప్రధాన జంట మధ్య జరుగుతున్నాయి ...
Date & Time : 04:10 AM July 21, 2017
-
హీరో బ్రదర్ పెళ్లి ప్రక్రియలో భాగంగా ఇండియా వచ్చారు..వరుణ్ కూడా ఇండియాకి వచ్చాడు.. ప్రస్తుతం హీరో, హీరోయిన్ మధ్య కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:02 AM July 21, 2017
-
హీరో వరుణ్ కుటుంబం పరిచయం అవ్వగానే...కథ ఇండియాకి షిఫ్ట్ అయ్యింది..సిన్ లోకి హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా పరిచయం చేయబడింది..
Date & Time : 03:56 AM July 21, 2017
-
హీరో వరుణ్ తేజ్ సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు..బ్యాక్ గ్రౌండ్ లో హే మిస్టర్ సాంగ్ వస్తోంది..
Date & Time : 03:52 AM July 21, 2017
-
ప్రస్తుతం తెరపై టైటిల్స్ వస్తున్నాయి... ఈ చిత్రం యుఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో నడుస్తోంది
Date & Time : 03:50 AM July 21, 2017
-
హాయ్..145 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 03:48 AM July 21, 2017