-
-
ఎంటర్ టైనింగ్ క్లైమాక్స్ ఎపిసోడ్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 3:15 AM June 23, 2017
-
విలన్, అల్లు అర్జున్ మధ్య ఆసక్తికర సీన్లు వస్తున్నాయి. అల్లు అర్జున్ తన మిషన్ లో సుబ్బరాజుని వాడుకుంటున్నాడు.
Date & Time : 3:10 AM June 23, 2017
-
అల్లు అర్జున్ విలన్లతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 3:05 AM June 23, 2017
-
విలన్ ని వెతికే పనిలో బన్నీ.. సుబ్బరాజుని కలిసాడు. అతడి నుంచి నిజాలు రాబట్టే సన్నివేశాలు హాస్యభరితంగా ఉన్నాయి.
Date & Time : 3:00 AM June 23, 2017
-
సాంగ్ పూర్తయింది. బన్నీ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఇరగదీశాడు.
Date & Time : 2:56 AM June 23, 2017
-
పూజా హెగ్డే, అల్లు అర్జున్ మధ్య రొమాంటిక్ సీన్ తరువాత సూపర్ హిట్ సాంగ్ 'ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, మెగాస్టార్ ' వస్తోంది.
Date & Time : 2:52 AM June 23, 2017
-
మెయిన్ విలన్ గురించి నిజాలు తెలుసుకున్న బన్నీ అతడిని వెతికే పనిలో పడ్డాడు. అందుకోసం పూజా హెగ్డే సాయం తీసుకుంటున్నాడు.
Date & Time : 2:48 AM June 23, 2017
-
అల్లు అర్జున్, పోలీస్ అధికారి మురళీశర్మ మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. మంచి ఫైట్ సీన్ వస్తోంది. బన్నీ తన పాత్రలో ఒదిగిపోయాడు.
Date & Time : 2:42 AM June 23, 2017
-
విలన్లు నిజాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకోసం అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 2:35 AM June 23, 2017
-
అల్లు అర్జున్, రావురమేష్ మధ్య కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 2:30 AM June 23, 2017
-
ప్రస్తుతం 'బాక్స్ బద్దలైపోయే'అనే సాంగ్ వస్తోంది. బన్నీ డాన్స్ తో అదరగొడుతున్నాడు.
Date & Time : 2:25 AM June 23, 2017
-
బన్నీ, పూజా హెగ్డే మధ్య లవ్ ప్రపోజల్ సీన్ వస్తోంది. హరీష్ శంకర్ రాసిన డైలాగులు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి.
Date & Time : 2:20 AM June 23, 2017
-
ఇంటర్వెల్ తరువాత సినిమా ప్రారంభమైంది. పూజాహెగ్డే, పోసాని మధ్య వస్తున్న ఫన్నీ సీన్లు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 2:15 AM June 23, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చిత్రం బావుంది. పట్టున్న కథనం, వేగంగా నడిచిన స్క్రీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన మూడు పాటలు చిత్రానికి ప్లస్ గా మారాయి.
Date & Time : 2:08 AM June 23, 2017
-
మరో ఫైట్స్ సీన్ వస్తోంది. చిత్రం చిన్న ట్విస్ట్.. అల్లు అర్జున్, రావురమేష్ ల మధ్య ఆసక్తికర సభాషణతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 2:05 AM June 23, 2017
-
రావురమేష్, పోసాని మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది. అద్భుతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ దిశగా చిత్రం సాగుతోంది.
Date & Time : 1:58 AM June 23, 2017
-
దుబాయ్ లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో పాటని చిత్రీకరించారు. కొరియోగ్రఫీ చాలా బావుంది.
Date & Time : 1:54 AM June 23, 2017
-
పూజా హెగ్డే అల్లు అర్జున్ ప్రేమలో పడింది. ప్రస్తుతం మెలోడీ సాంగ్ 'గుడిలో బడిలో మడిలో ఒడిలో' వస్తోంది.
Date & Time : 1:52 AM June 23, 2017
-
సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు. పూజా హెగ్డే, సుబ్బరాజు మధ్య ఫన్నీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 1:48 AM June 23, 2017
-
పూజా హెగ్డే తండ్రిగా పోసాని కృష్ణమురళి ఎంట్రీ ఇచ్చాడు. రావురమేష్ కి పోసాని సన్నిహితుడు.
Date & Time : 1:44 AM June 23, 2017
-
చంద్ర మోహన్ సమస్యని అల్లు అర్జున్ తెలుసుకున్నాడు. సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫైట్ వస్తోంది.
Date & Time : 1:40 AM June 23, 2017
-
అల్లు అర్జున్, సీనియర్ నటుడు చంద్ర మోహన్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:34 AM June 23, 2017
-
సినిమాలో మరో పాట 'మెచ్చుకో..మెచ్చుకో' వస్తోంది. పాటలో అల్లు అర్జున్ ట్రెడిషనల్ లుక్ బావుంది.
Date & Time : 1:30 AM June 23, 2017
-
పూజా హెగ్డే చాలా హాట్ గా కనిపిస్తోంది. బన్నీ, పూజా హెగ్డే ల మధ్య హాస్యభరితమైన సీన్లు వస్తున్నాయి.
Date & Time : 1:26 AM June 23, 2017
-
చిత్రంలో కామెడీ సీన్లు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో తన డైలాగ్ డెలివరీ తో అలరిస్తున్నాడు.
Date & Time : 1:22 AM June 23, 2017
-
హీరోయిన్ పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అల్లు అర్జున్, కిషోర్ ల మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:20 AM June 23, 2017
-
'నాయుడు' గా రావురమేష్ ఎంట్రీ ఇచ్చాడు. రావురమేష్ పాత్ర 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంలో తన తండ్రి రావు గోపాల్ రావు పాత్రని పోలి ఉంది.
Date & Time : 1:15 AM June 23, 2017
-
ప్రస్తుతం టైటిల్ సాంగ్ 'శరణం భజే భజే డీజే' వస్తోంది. సాంగ్ లో అల్లు అర్జున్ హీరోయిజాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 1:10 AM June 23, 2017
-
భారీ ఫైట్ సీన్ వస్తోంది. ఫైట్ ని చాలా స్టైలిష్ గా కంపోజ్ చేశారు.
Date & Time : 1:06 AM June 23, 2017
-
పోలీస్ అధికారిగా మురళీశర్మ ఎంట్రీ ఇచ్చాడు. కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:04 AM June 23, 2017
-
యాంకర్ ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 1:02 AM June 23, 2017
-
బ్రాహ్మణ పాత్రలో అల్లు అర్జున్ అలరిస్తున్నాడు. బన్నీ డైలాగ్ డెలివరీ చాలా బావుంది.
Date & Time : 12:58 AM June 23, 2017
-
దువ్వాడ జగన్నాథమ్ గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు..బన్నీ ఎంట్రీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
Date & Time : 12:55 AM June 23, 2017
-
అల్లు అర్జున్ చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:50 AM June 23, 2017
-
అన్నపూర్ణా క్యాటరింగ్ సభ్యులుగా తనికెళ్ళ భరణి మరియు కొంత మంది నటులు పరిచయం అయ్యారు.
Date & Time : 12:45 AM June 23, 2017
-
హాయ్.. 156 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 12:40 AM June 23, 2017
-
సరైనోడు వంటి ఘనవిజయం తరువాత అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ రోజు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి.
Date & Time : 12:35 AM June 23, 2017