-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:45 AM March 10, 2017
-
సింధు తులాని, అర్జున్ బజ్వా మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:40 AM March 10, 2017
-
చిత్రంలో అంజలికి సంబంధించిన మరో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 11:35 AM March 10, 2017
-
చిత్రంలో ట్విస్ట్ తో క్లైమాక్స్ మొదలైంది. సింధూ తులాని ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:25 AM March 10, 2017
-
అంజలి గతం గురించి చిత్రంలో ట్విస్ట్ వచ్చింది. చిత్రం క్లైమాక్స్ దిశగా వెళుతోంది.
Date & Time : 11:10 AM March 10, 2017
-
సప్తగిరికి సంబందించిన హర్రర్ కామెడీ సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 11:00 AM March 10, 2017
-
కొన్నేళ్ల క్రితం జరిగిన హత్యకు సంబందించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:55 AM March 10, 2017
-
స్వాతి దీక్షిత్ అంజలితో జత కలిసింది. హీరోయిన్ సాక్షి గులాటి పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:50 AM March 10, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. సప్తగిరికి సంబందించిన హర్రర్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:47 AM March 10, 2017
-
చిత్రంలో ట్విస్ట్ వచ్చింది.తనని వెంటాడుతున్న దెయ్యం గురించి అంజలికి ఆధారం లభించింది.ఆసక్తి కరమైన సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:32 AM March 10, 2017
-
అంజలి, సప్తగిరి మధ్య హర్రర్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:25 AM March 10, 2017
-
కమెడియన్ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. తన వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలను అంజలి మొదలుపెట్టింది.
Date & Time : 10:15 AM March 10, 2017
-
సప్తగిరి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.సప్తగిరి అంజలికి సాయం చేస్తున్నాడు.
Date & Time : 10:10 AM March 10, 2017
-
తన సమస్యని పరిష్కరించుకోవడనికి అంజలి అమెరికా వెళుతోంది.
Date & Time : 10:05 AM March 10, 2017
-
అంజలి వత్తిడికి లోనవుతోంది.దెయ్యం ఆమెలోకి ప్రవేశించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:55 AM March 10, 2017
-
దెయ్యం అంజలిని ఆవాహించాడనికి ప్రయత్నిస్తోంది. కొన్ని హర్రర్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:50 AM March 10, 2017
-
పెళ్ళికి సంబందించిన పాట వస్తోంది. ఈ పాటను అంజలి పాడుతోంది.
Date & Time : 09:40 AM March 10, 2017
-
తమిళ నటుడు జయప్రకాష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. హాస్టల్ బ్యాక్ డ్రాప్లో కొన్ని హర్రర్ సీన్లు చూపిస్తున్నారు.
Date & Time : 09:35 AM March 10, 2017
-
కాలేజ్ ప్రొఫెసర్ అయిన అంజలి ఉంటున్న హాస్టల్ లో దెయ్యాలు ఉన్నట్టు చూపుతున్నారు.
Date & Time : 09:30 AM March 10, 2017
-
పబ్ సాంగ్ ద్వారా అంజలి ఆసక్తికరమైన ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన డ్యాన్సింగ్ స్కిల్స్ చూపడానికి ట్రై చేస్తోంది.
Date & Time : 09:25 AM March 10, 2017
-
అర్జున్ బజ్వ హత్యతో సినిమా మొదలైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా రూపొందింది.
Date & Time : 09:20 AM March 10, 2017
-
144 నిముషాల నిడివి ఉన్న సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:15 AM March 10, 2017