-
చిత్రం పూర్తయింది.పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:18 AM April 28, 2017
-
మహేంద్ర బాహుబలి బల్లాల దేవుడిని ఓడించి మాహిష్మతికి రాజుగా అవతరించాడు.
Date & Time : 12:15 AM April 28, 2017
-
మహేంద్ర బాహుబలి, రానా మధ్య భీకరమైన ఫైట్ వస్తోంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.
Date & Time : 12:08 AM April 28, 2017
-
అవంతిక కూడా యుద్ధంలో జాయిన్ అయింది. చిత్రం క్లైమాక్స్ వైపు నడుస్తోంది.
Date & Time : 12:02 AM April 28, 2017
-
భీకరమైన యుద్ధ సన్నివేశం వస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.కాలకేయ యుద్ధం కంటే పెద్దదిగా ఉంది.
Date & Time : 11:54 PM April 27, 2017
-
శివగామి రాజ్యం నుంచి పారిపోయింది.ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో ప్రస్తుత కథ వస్తోంది.
Date & Time : 11:48 PM April 27, 2017
-
కట్టప్ప, శివగామి ల మధ్య సంభాషణ అద్భుతంగా ఉంది.అనుష్క కూడా ఎమోషనల్ సీన్ లో ఆకట్టుకుంటోంది.
Date & Time : 11:40 PM April 27, 2017
-
యుద్ధసన్నివేశంలో కట్టప్ప బాహుబలిని చంపే సీన్ వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి.
Date & Time : 11:34 PM April 27, 2017
-
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్నివేశం వచ్చేసింది.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సీన్ వస్తోంది.
Date & Time : 11:28 PM April 27, 2017
-
రానా పాత్ర ఎంత భయకరమైందో అనే విషయం బయటపడింది. అతడి నటన అద్భుతంగా ఉంది.
Date & Time : 11:24 PM April 27, 2017
-
ఎమోషనల్ సాంగ్ 'దండాలయ్యా ' వస్తోంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హృదయాన్ని హద్దుకుంటోంది.
Date & Time : 11:12 PM April 27, 2017
-
ఫ్యామిలీ డ్రామాతో ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది.
Date & Time : 11:08 PM April 27, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇండియన్ సినిమాలో ఎవరూ చూపించని అద్భుతమైన సన్నివేశాల్ని రాజమౌళి చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులు కేరింతలు కొట్టేలా ఉన్నాయి.
Date & Time : 10:55 PM April 27, 2017
-
అద్భుతమైన సన్నివేశంతో చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.సూపర్బ్ సీన్ తో ఇంటర్వెల్ పడింది
Date & Time : 10:50 PM April 27, 2017
-
పెద్ద ట్విస్ట్ వచ్చింది.వస్తున్న సన్నివేశం తో ఆడియన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Date & Time : 10:42 PM April 27, 2017
-
కథ మళ్లీ మాహిష్మతి రాజ్యంలోకి వచ్చింది.అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 10:38 PM April 27, 2017
-
రొమాంటిక్ సాంగ్ 'హంస నావ' వస్తోంది. ప్రభాస్, అనుష్క ల కెమిస్ట్రీ కన్నుల పండుగలా ఉంది. విజువల్స్ చాలా బావున్నాయి.
Date & Time : 10:30 PM April 27, 2017
-
అద్భుతమైన యుద్ధ సన్నివేశంలో ప్రభాస్, అనుష్క చాలా బాగా నటిస్తున్నారు.
Date & Time : 10:20 PM April 27, 2017
-
అనుష్క అద్భుతంగా నటిస్తోంది. ప్రస్తుతం ఓ మంచి సన్నివేశం వస్తోంది.
Date & Time : 10:14 PM April 27, 2017
-
రానా, రమ్యకృష్ణ ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:10 PM April 27, 2017
-
ప్రస్తుతం కన్నా నిదిరించురా సాంగ్ వస్తోంది. ఈ పాట కోసం అందమైన సెట్ వేశారు.
Date & Time : 10:05 PM April 27, 2017
-
కుమార వర్మ గా సుబ్బరాజు ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్, అనుష్క, సుబ్బరాజు మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:57 PM April 27, 2017
-
దేవసేనగా అనుష్క ఎంట్రీ ఇచ్చింది. కుంతల సామ్రాజ్యాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 09:50 PM April 27, 2017
-
మాహిష్మతి రాజ్యాన్ని చూపిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి ప్రజలను కలుసుకునేందుకు వెళుతున్నాడు.
Date & Time : 09:46 PM April 27, 2017
-
బల్లాల దేవుడిగా రానా ఎంట్రీ ఇచ్చాడు. నాజర్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. కట్టప్ప, నాజర్, రానా ల మధ్య సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:42 PM April 27, 2017
-
ప్రభాస్ సూపర్ ఎంట్రీ తో థీయేటర్ ఒక్కసారిగా మోతెక్కిపోయింది. హిట్ సాంగ్ 'సాహోరే బాహుబలి' వస్తోంది.
Date & Time : 09:34 PM April 27, 2017
-
బాహుబలి 1 సన్నివేశాలను చూపించిన తరువాత కట్టప్ప వాయిస్ ఓవర్ తో శివగామిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 09:28 PM April 27, 2017
-
బాహుబలి మొదటి భాగం సన్నివేశాలను చూపిస్తున్నారు.
Date & Time : 09:24 PM April 27, 2017
-
బాహుబలి 2 చిత్రం ప్రారంభమైంది.ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 09:23 PM April 27, 2017
-
షో ప్రారంభమైంది. సాహో టీజర్ వస్తోంది.అభిమానులు ప్రభాస్ ని చూడగానే సందడి చేస్తున్నారు.
Date & Time : 09:21 PM April 27, 2017
-
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రం మొదటి షో మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.మేము మీకు లైవ్ అప్ డేట్స్ అందిస్తాము.సిద్ధంగా ఉండండి.
Date & Time : 09:15 PM April 27, 2017