-
ఫైనల్ రిపోర్ట్ : అంతా ఊహించిన విధంగానే బాహుబలి 2 ని రాజమౌళి మరో లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. ఈ చిత్రం పై ఉన్న భారీ ఆంచనాలను రాజమౌళి అందుకున్నాడు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చూడవలసిన చిత్రం ఇది.
Date & Time : 12:23 AM April 28, 2017
-
అద్భుతమైన క్లైమాక్స్ తో చిత్రం ముగిసింది.బాహుబలి మాహిష్మతికి రాజయ్యాడు. చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:18 AM April 28, 2017
-
రానా, ప్రభాస్ ల మధ్య పోరాటం అద్భుతంగా ఉంది.
Date & Time : 12:15 AM April 28, 2017
-
అద్భుతమైన ఫైట్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదేస్థాయిలో ఉంది.
Date & Time : 12:12 AM April 28, 2017
-
యుద్ధ సన్నివేశాల్ని స్టైలిష్ గా చిత్రీకరించారు. ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు.
Date & Time : 12:05 AM April 28, 2017
-
సన్నివేశాలు ఇంకా ఆసక్తిగా మారుతున్నాయి.భారీ యుద్ధ సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:59 PM April 27, 2017
-
బల్లాల దేవుడిపై మహేంద్ర బాహుబలి యుద్ధం ప్రకటించాడు. ట్విస్ట్ తో కథ ఫైనల్ వార్ వైపు సాగుతోంది.
Date & Time : 11:56 PM April 27, 2017
-
ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ప్రజెంట్ స్టోరీ నడుస్తోంది.ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 11:50 PM April 27, 2017
-
కట్టప్ప, శివగామి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇద్దరూ అద్భుతంగా నటిస్తున్నారు.
Date & Time : 11:42 PM April 27, 2017
-
అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది. కట్టప్ప బాహుబలిని చంపేశాడు.
Date & Time : 11:36 PM April 27, 2017
-
కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాన్ని ప్రేక్షుకులు సైలెంట్ గా చూస్తున్నారు.
Date & Time : 11:29 PM April 27, 2017
-
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:25 PM April 27, 2017
-
చిత్రంలో మరో పాట వస్తోంది.బాహుబలి సమస్యల్లో చిక్కుకుంటున్నారు.
Date & Time : 11:20 PM April 27, 2017
-
రానాకి సంబదించిన సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:16 PM April 27, 2017
-
మాహిష్మతి లో అనుష్క సమస్యలని చూపిస్తున్నారు.
Date & Time : 11:12 PM April 27, 2017
-
పెళ్లి సన్నివేశాలు వస్తున్నాయి. విజువల్స్ చాలా బావున్నాయి.
Date & Time : 11:08 PM April 27, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం మొదలైంది. రానా, నాజర్ లు భారీ పథకం వేస్తున్నారు.
Date & Time : 11:05 PM April 27, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : అందరూ ఊహించిన విధంగానే రాజమౌళి అద్భుతంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ లో అద్భుతమైన సన్నివేశాలతో ప్రేక్షకుల ఆనందం తారాస్థాయికి చేరింది. ఎమోషన్ , డ్రామా అన్ని చిత్రంలో కలగలిపి ఉన్నాయి.సెకండ్ హాఫ్ ఇంకా ఆసక్తిగా సాగనున్నట్లు అర్థమవుతోంది.
Date & Time : 10:52 PM April 27, 2017
-
అద్భుతమైన సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 10:49 PM April 27, 2017
-
అద్భుతమైన ఇంటర్వెల్ సన్నివేశం వస్తోంది. ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 10:44 PM April 27, 2017
-
మాహిష్మతి రాజ్యానికి సంబంధించి థ్రిల్లింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.సస్పెన్స్ కొనసాగుతోంది.
Date & Time : 10:40 PM April 27, 2017
-
ప్రభాస్ అనుష్క ల మధ్య రొమాంటిక్ సాంగ్ 'ఓరి ఓరి రాజా' వస్తోంది. ఈ పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 10:35 PM April 27, 2017
-
యుద్ధం అద్భుతంగా ఉంది.ప్రభాస్ ని సూపర్ హీరో లా చూపిస్తున్నారు.
Date & Time : 10:27 PM April 27, 2017
-
అనుష్క రాజ్యంలో మొదటి యుద్ధం మొదలైంది. ప్రభాస్, అనుష్క లు అద్భుతమైన యాక్షన్ సన్నివేశంలో నటిస్తున్నారు.
Date & Time : 10:23 PM April 27, 2017
-
చిత్రంలో చిన్న ట్విస్ట్ వచ్చింది. రానా, ప్రభాస్, అనుష్క ల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది.
Date & Time : 10:13 PM April 27, 2017
-
చిత్రంలో మరో పాట వస్తోంది. అనుష్క అందంగా స్లిమ్ గా కనిపిస్తోంది.
Date & Time : 10:10 PM April 27, 2017
-
ప్రభాస్, అనుష్క ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రం నడుస్తోంది.
Date & Time : 10:05 PM April 27, 2017
-
అనుష్క సహాయకుడిగా 30 ఇయర్స్ పృథ్వి ఎంట్రీ ఇచ్చాడు.సుబ్బరాజు చేస్తున్న కామెడీ బావుంది.
Date & Time : 10:00 PM April 27, 2017
-
ప్రభాస్ తో సుబ్బరాజు కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:54 PM April 27, 2017
-
అనుష్క యువరాణి గా సూపర్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చింది.బాహుబలి ని చూడగానే ప్రేమలో పడింది. సుబ్బరాజు కూడా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:49 PM April 27, 2017
-
రానా, కట్టప్ప ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:44 PM April 27, 2017
-
ప్రభాస్ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. సాహోరే బాహుబలి సాంగ్ వస్తోంది.
Date & Time : 09:40 PM April 27, 2017
-
ఫస్ట్ పార్ట్ ముగిసిన దగ్గరనుంచే సినిమా మొదలయింది. రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:38 PM April 27, 2017
-
స్టైలిష్ గా టైటిల్స్ పడుతున్నాయి. ఫస్ట్ పార్ట్ సన్నివేశాలను చూపిస్తున్నారు.
Date & Time : 09:35 PM April 27, 2017
-
థాంక్స్ కార్డ్స్ ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి.
Date & Time : 09:30 PM April 27, 2017
-
హాయ్.. 170 నిమిషాల నిడివిగల బాహుబలి 2 చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 09:25 PM April 27, 2017